రక్షణ రంగానికి సంబంధించిన సంస్థల షేర్లు సోమవారం (మే18న) ప్రారంభ ట్రేడింగ్లో సుమారు 10 శాతం మేర పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రక్షణ ఉత్పత్తుల తయారీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను సడలించి, నేరుగా పెట్టే పెట్టుబడులను 74 శాతానికి పెంచిన నేపథ్యంలో మదుపర్లు కొనుగోలుకు మొగ్గుచూపారు.
మార్కెట్లలో ప్రతికూల పవనాలు ఉన్నప్పటికీ.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్లు 10 శాతం, భారత్ ఎలక్ట్రానిక్స్ 5.53 శాతం, బీఈఎంఎల్ 5.31 శాతం, ఆస్ట్రా మైక్రోప్రాడక్ట్స్ 4.93 శాతం, భారత్ డైనమిక్స్ 4.71 శాతం మేర వృద్ధి చెందాయి.