తెలంగాణ

telangana

ETV Bharat / business

'అలా చేయకుంటే స్టాక్ ఎక్స్ఛేంజీలను మూసేయండి'

అత్యవసర సేవలుగా స్టాక్ బ్రోకింగ్​ను అన్ని రాష్ట్రాలు గుర్తించకపోతే ఎక్స్ఛేంజీలను మూసివేయాలని 'సెబీ'కి పలు సంఘాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. లాక్​డౌన్​ పరిస్థితుల్లో బ్రోకర్లు, డిపాజిటర్లకు ప్రయాణం అసాధ్యంగా మారిందని సీపీఏఐతో పాటు ఏఎన్​ఎంఐ వెల్లడించాయి.

sebi
సెబీ

By

Published : Mar 24, 2020, 6:49 PM IST

Updated : Mar 24, 2020, 7:13 PM IST

కరోనా విజృంభణ నేపథ్యంలో స్టాక్ ఎక్స్ఛేంజీలను మార్చి 31వరకు మూసివేయాలని సెబీని కమోడిటీ పార్టిసిపెంట్స్ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (సీపీఏఐ) కోరింది. ఎక్స్ఛేంజి సేవలను రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసరమైనవిగా గుర్తించకపోతే ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

భారత జాతీయ ఎక్స్ఛేంజీ సభ్యుల సంఘం(ఏఎన్​ఎంఐ) కూడా స్టాక్ మార్కెట్ల కార్యకలాపాలను కనీసం 2 రోజులు నిలిపేయాలని సెబీని కోరింది. ఫలితంగా బ్రోకరేజీ సంస్థలు ప్రస్తుత పరిస్థితులను అధిగమించే అవకాశం లభిస్తుందని తెలిపింది.

లాక్​డౌన్​ నిబంధనల పరిధి నుంచి సెబీ నియంత్రిత స్టాక్ మార్కెట్ల సేవలు, ఉద్యోగులను మినహాయించాలని ఆయా రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కేంద్రం సూచించింది. అయితే బ్రోకర్లు, డిపాజిటర్లకు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు వీలులేకపోవటం వల్లనే సీపీఏఐ, ఏఎన్​ఎంఐ తాజా డిమాండ్ చేస్తున్నాయి.

"కరోనాతో మానవాళికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూ, 144 సెక్షన్​, లాక్​డౌన్​ అమల్లో ఉన్నాయి. ఫలితంగా ప్రయాణం చాలా క్లిష్టంగా మారిపోయింది. మరికొద్ది రోజులు పోతే వారి కార్యాలయానికి చేరుకోవటం అసాధ్యమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అన్ని ఎక్స్ఛేంజీలను మార్చి 31 వరకు మూసివేయాలి."

- నరిందర్​ వధ్వా, సీపీఏఐ అధ్యక్షుడు

ఇప్పటివరకు స్టాక్ బ్రోకింగ్ సేవలను మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్​ రాష్ట్రాలు మాత్రమే గుర్తించాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించి ఎలాంటి నిబంధనలు జారీ చేయలేదు.

Last Updated : Mar 24, 2020, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details