పెళ్లిళ్లు, పేరంటాలు, పండగలు, వేడుకలు.. ఇంట్లో ఏ శుభకార్యం అయినా.. ముందు ఆడవాళ్ల మదిలో మెదిలేది బంగారం. రేటు ఎంత పెరిగినా... బడ్జెట్‌ను బట్టి పసిడిని కొనుగోలు చేస్తుంటారు. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా బంగారం వ్యాపారం అంత ఆశాజనకంగా సాగడం లేదు. అమ్మకాలు బాగా పడిపోవడంతో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్లతో పాటు సరికొత్త డిజైన్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. కొవిడ్ కొంత అదుపులోకి రావడంతో వాయిదా పడుతూ వచ్చిన కొత్త షోరూమ్‌ల ప్రారంభోత్సవాలను ముమ్మరం చేస్తున్నారు.
అతివలు మెచ్చే కలెక్షన్లు
బంగారం కొనుగోలు చేసే అతివలు.. హెవీలుక్‌తో పాటు తక్కువ బడ్జెట్ ఉండే కలెక్షన్ వైపు మొగ్గుచూపుతుండటంతో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను రూపొందిస్తున్నాం. టెంపుల్ జ్యువెలరీ, ప్రీషియస్ స్టోన్ జ్యువెలరీ, మైన్‌రేర్ డైమండ్, ఎరా కుండన్ జ్యువెలరీ, జెవెల్ కలెక్షన్ పేరుతో 18 క్యారెట్ బంగారు ఆభరణాలను అందుబాటులోకి తెస్తున్నాం. చిన్న చిన్న రింగ్‌ల నుంచి భారీ హారాలు, నెక్లెస్, బ్యాంగిల్స్ వంటివి పెద్దవారితో పాటు చిన్నారులకూ తయారుచేస్తున్నాం. అమ్మకాలను పెంచుకునేందుకు ప్రత్యేక ఆఫర్ల అందిస్తున్నాం. కొవిడ్ కారణంగా వాయిదా పడిన పెళ్లిళ్ల కోసం బంగారం కొనుగోలు చేసే వారికి అడ్వాన్స్ బుకింగ్స్, ప్రత్యేక తగ్గింపు ధరలతో పాటు ఆభరణాల లైఫ్ టైమ్ మెయిన్‌టెనెన్స్ ఉచితం. స్టోన్ వర్క్ రీప్లేస్ మెంట్, ఫ్రీ సర్వీస్, ఎక్స్ చేంజ్ ఆఫర్లూ ఉన్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా ఆఫర్లతో పాటు వైరస్ బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం.
-జ్యువెలరీ వ్యాపారులు