ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావంతో దేశీయ మార్కెట్లు డీలా పడ్డాయి. దేశంలో లాక్డౌన్ కొనసాగిస్తారన్న అనుమానాలు, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల షేర్లు తీవ్రంగా పతనమవడం వల్ల స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
ఇవాళ్టి ట్రేడింగ్‌లో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 470 పాయింట్లు కోల్పోయింది. చివరకు 30,690 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లోనివివే
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో బజాజ్ ఫైనాన్స్ 10 శాతానికి పైగా నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల షేర్లు 3.12 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3.44 శాతం పతనమయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర, టైటాన్, హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ, టెక్ మహీంద్ర కంపెనీల షేర్లు సైతం నష్టాలబాట పట్టాయి.
ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రా టెక్ సిమెంట్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో పయనించాయి.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ.. 118 పాయింట్లు క్షీణించి 8,994 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.