తెలంగాణ

telangana

ETV Bharat / business

త్వరలోనే బీఎస్​ఈలో ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ - ఈజీఆర్​ అంటే ఏమిటి

తమ ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ను(ఈజీఆర్‌లు) పరిచయం చేసేందుకు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) సిద్దమైంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుని ఈ కొత్త సెక్యూరిటీల ట్రేడింగ్‌ను తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రారంభిస్తామని తెలిపింది.

gold recipts in bse
ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌

By

Published : Oct 4, 2021, 7:08 AM IST

Updated : Oct 21, 2021, 8:46 AM IST

తమ ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్స్‌ను(ఈజీఆర్‌లు) పరిచయం చేసేందుకు అవసరమైన సాంకేతికతను సిద్ధం చేసినట్లు బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) ఆదివారం తెలిపింది. దేశవ్యాప్తంగా పసిడి ధర ఒకేలా ఉండేందుకు ఈ ప్రక్రియ దోహదం చేయనుందని బీఎస్‌ఈ ముఖ్య వ్యాపార అధికారి (సీబీఓ) సమీర్‌ పాటిల్‌ వెల్లడించారు. అంతర్గతంగా అవసరమైన అనుమతులు తీసుకోవడం సహా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసుకుని ఈ కొత్త సెక్యూరిటీల (అసెట్‌ క్లాస్‌) ట్రేడింగ్‌ను తమ ప్లాట్‌ఫామ్‌పై ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో పసిడి డెరివేటివ్స్‌, ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) రూపంలోనే ట్రేడింగ్‌ చేసేందుకు అనుమతి ఉంది. ఇతర దేశాల్లో అయితే పసిడి లోహాన్ని ట్రేడింగ్‌ చేసేందుకు స్పాట్‌ ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. పసిడిని ప్రతిబింబించే పెట్టుబడి సాధనాలను ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రసీదులు (ఈజీఆర్‌)గా పిలుస్తారు. వీటిని సెక్యూరిటీలుగా నోటిఫై చేస్తారు. దీంతో ఇతర సెక్యూరిటీల మాదిరే వీటిని ట్రేడింగ్‌, క్లియరింగ్‌, సెటిల్‌మెంట్‌ చేయడానికి వీలవుతుంది.

  • ముందుగా పసిడి లోహం బరువుకు అనుగుణంగా ఈజీఆర్‌లను రూపొందిస్తారు. డీమ్యాట్‌ రూపంలో ఉండే వీటిని ట్రేడింగ్‌ చేస్తారు. వీటిని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెటిల్‌ చేస్తాయి. అవసరమైనప్పుడు లోహ రూపంలో తీసుకోవచ్చు.
  • ప్రారంభంలో ఈజీఆర్‌లను 1 కిలో, 100 గ్రాముల పరిణామాల్లో బీఎస్‌ఈ అందుబాటులోకి తేవచ్చు. తరవాత దశల వారీగా 50 గ్రాములు, 10 గ్రాములు, 5 గ్రాముల్లోనూ ఈజీఆర్‌లను జారీ చేయవచ్చని తెలుస్తోంది.
  • బ్యాంకులు, ఖజానాలు, టోకు-రిటైల్‌ వ్యాపారులు, దిగుమతిదార్లు-ఎగుమతిదార్లు కూడా ఈజీఆర్‌ ట్రేడింగ్‌లో భాగమవుతారు.
Last Updated : Oct 21, 2021, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details