వరుసగా రెండో వారాంతపు సెషన్లో భారీ నష్టాలను నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 894 పాయింట్లు కోల్పోయి 37,577 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయి 10,989 పాయింట్లకు చేరుకుంది.
3.85 లక్షల కోట్లు ఆవిరి..
ప్రారంభ సెషన్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా 1,400 పాయింట్ల మేర కోల్పోయింది సెన్సెక్స్. ఫలితంగా మదుపరులు రూ. 3,85,485 కోట్ల సంపదను కోల్పోయారు.
కరోనా భయాలు, ఎస్ బ్యాంక్‌పై మారటోరియం విధింపు వల్ల స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టపోవటమూ దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. బ్యాంకింగ్ రంగ షేర్లు 5 శాతం మేర నష్టపోయాయి. వాహన, లోహ రంగాలు స్వల్పంగా రాణించాయి.