అంతర్జాతీయ ప్రతికూలతలు, లోహ రంగ షేర్ల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఐటీ, విద్యుత్ రంగ షేర్ల దూకుడుతో వచ్చిన లాభాలు.. చివరి సెషన్లో ఆవిరయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోయి 38,365 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11,317 పాయింట్లకు చేరింది.
ఐటీ, విద్యుత్ షేర్ల దూకుడుతో మిడ్ సెషన్లో 248 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.. 38,498 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
లాభనష్టాల్లో..
హెచ్‌సీఎల్ టెక్, ఇన్పోసిస్, రిలయన్స్, టీసీఎస్, ఐసీఐసీఐ, టెక్‌మహీంద్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు రాణించాయి.
టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు వెనకబడ్డాయి.