తెలంగాణ

telangana

ETV Bharat / business

టోకు ద్రవ్యోల్బణం తగ్గినా.. దిగిరాని ధరలు - దిగిరాని ధరలు

ఏప్రిల్​లో టోకు ధరల ద్రవ్యోల్బణం 3.07 శాతంగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో ఉన్న దానితో పోలిస్తే ఇది 0.55 శాతం తక్కువ. మార్చిలో డబ్ల్యూపీఐ 3.18 శాతంగా ఉంది.

టోకు ద్రవ్యోల్బణం

By

Published : May 14, 2019, 1:31 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) ఏప్రిల్​లో 3.07 శాతంగా నమోదైంది. ఇంధన ధరలు తగ్గడం, తయారీ వస్తువుల ధరలు అదుపులో ఉన్న కారణంగా ద్రవ్యోల్బణం గతంతో పోలిస్తే తక్కువగా నమోదైనట్లు కేంద్ర గణాంకాల శాఖ ప్రకటించింది.

ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ ఆహార ఉత్పత్తుల ధరలు మాత్రం అధికంగానే ఉన్నట్లు తెలిపింది.

టోకు ధరల ద్రవ్యోల్బణం గతేడాది ఏప్రిల్​లో 3.62 శాతంగా ఉంది. ఈ ఏడాది మార్చిలో 3.18 శాతంగా నమోదైంది.

కొండెక్కిన ఆహార ఉత్పత్తుల ధరలు

ఆహార ఉత్పత్తులు, కూరగాయలపై ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం మార్చిలో 28.13 ఉండగా ఏప్రిల్​లో 40.65 శాతానికి పెరిగింది. ఇదే సమయానికి ఆహార ఉత్పత్తులపై టోకు ద్రవ్యోల్బణం 5.68 నుంచి 7.37 శాతానికి చేరింది.

ఈ ఏడాది మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్​లో 'ఇంధనం' టోకు ద్రవ్యోల్బణం 5.41 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గింది.

ఉత్పాదక వస్తువుల ద్రవ్యోల్బణం ఏప్రిల్​లో 1.72 శాతంగా నమోదైంది. ఇది మార్చిలో 2.16 శాతంగా ఉంది.

ఇటీవల ప్రకటించిన గణాంకాల్లో రిటైల్​ ద్రవ్యోల్బణం 2.92 శాతంతో ఆరు నెలల గరిష్ఠాన్ని తాకింది. అయితే ఇది అంచనాలకు అనుగుణంగానే ఉందని ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం.

ఆర్బీఐ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా కీలక వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. తదుపరి ఎంపీసీ సమావేశం జూన్​లో జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details