టోకు ధరల సూచీ ప్రకారం ద్రవ్యోల్బణం 0.58 శాతం పెరిగిందని వాణిజ్య, పరిశ్రమలశాఖ గణాంకాలు తెలిపాయి. గత అక్టోబర్ మాసంలో 0.16గా ఉన్న ద్రవ్యోల్బణం.. నవంబర్ నెలలో 0.58గా నమోదైందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
నెలవారీ టోకు ధరల సూచీ ఆధారంగా కొలిచే వార్షిక ద్రవ్యోల్బణం 2018 నవంబర్లో 4.47గా నమోదైందని గణాంకాలు స్పష్టం చేశాయి.
ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 11 శాతంగా నమోదైందని.. అక్టోబర్ నెలలో ఇది 9.8 అని వెల్లడించింది ప్రభుత్వం. అదే సమయంలో ఆహారేతర పదార్థాల ద్రవ్యోల్బణం 2.35 నుంచి 1.93కు తగ్గిందని వాణిజ్య శాఖ పేర్కొంది.
ఉత్పత్తి వస్తువులపై టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 0.84 వద్ద స్థిరంగా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. అదే వినియోగ ధరల సూచీ ప్రకారం ద్రవ్యోల్బణం మూడు సంవత్సరాల గరిష్ఠానికి చేరి 5.54 గా నమోదైందని ప్రకటించారు.
ఇదీ చూడండి: పెరిగిన పసిడి ధర- వెండి పైపైకి