తెలంగాణ

telangana

ETV Bharat / business

WPI inflation: జీవనకాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం - ఇంధన ధరల్లో పెరుగుదలే టోకు ధరలు పెరిగేందుకు కారణం

మే నెలలోనూ టోకు ద్రవ్యోల్బణం(WPI inflation) భారీగా పెరిగింది. ఏప్రిల్​తో పోలిస్తే.. 2.45 శాతం పెరిగి జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఏప్రిల్​లోనే టోకు ద్రవ్యోల్బణం తొలిసారి రెండంకెల స్థాయిని చేరడం గమనార్హం. ఇంధన ధరలు పెరగటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

WPI inflation hit record level
రికార్డు స్థాయికి టోకు ద్రవ్యోల్బణం

By

Published : Jun 14, 2021, 1:06 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(WPI inflation) మే నెలలోనూ జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. డబ్ల్యూపీఐ గత నెల 12.94 శాతంగా నమోదైనట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. క్రూడ్​ ఆయిల్​, తయారీ వస్తువుల ధరలు పెరగటమే ఇందుకు కారణంగా పేర్కొంది.

డబ్ల్యూపీఐ గత ఏడాది మేలో -3.37 శాతంగా, ఈ ఏడాది ఏప్రిల్​లో 10.49 శాతంగా ఉండటం గమనార్హం. ఏప్రిల్​లోనే టోకు ద్రవ్యోల్బణం తొలిసారి రెండంకెల స్థాయికి చేరింది.

వాణిజ్య శాఖ డేటాలో వెల్లడైన విషయాలు..

  • ఇంధన ధరల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మేలో.. ఏప్రిల్​తో పోలిస్తే 20.94 శాతం నుంచి 37.61 శాతానికి పెరిగింది.
  • తయారీ వస్తువుల టోకు ద్రవ్యోల్బణం గత నెల 10.83 శాతానికి చేరింది.
  • ఉల్లి ధరలు పెరిగినా.. ఆహార ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం మాత్రం మేలో 4.31 శాతానికి తగ్గింది.
  • ఉల్లి టోకు ద్రవ్యోణం గత నెల 23.24 శాతానికి పెరిగింది. ఏప్రిల్​లో ఇది 19.72 శాతంగా ఉంది.

ఇదీ చదవండి:భారీగా కుదేలైన అదానీ షేర్లు.. కారణమిదే!

ABOUT THE AUTHOR

...view details