టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) -3.21 శాతానికి దిగొచ్చింది. ఇంధనం, విద్యుత్ ధరల పతనమే ఇందకు కారణమని కేంద్రం ప్రకటించింది. అయితే ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 1.13 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.
- 2020 మే నెలకు గాను టోకు ద్రవ్యోల్బణం -3.21 శాతంగా నమోదైంది. గతేడాది మే నెలలో ఇది - 2.79 శాతంగా ఉంది.
- విద్యుత్, ఇంధన ద్రవ్యోల్బణం -19.83 శాతానికి పడిపోయింది. గత నెలలో -10.12 శాతం నమోదైంది.
- ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 1.13 శాతం. ఏప్రిల్లో ఇది 2.55 శాతంగా నమోదైంది.
- తయారీరంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం -0.42 శాతం