ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆహార ధరలు పెరిగినా టోకు ద్రవ్యోల్బణం డౌన్ - WPI LATEST NEWS

ఇంధన, విద్యుత్ ధరల పతనంతో జూన్​లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 0.58 శాతం తగ్గింది. జూన్​ నెలలో డబ్ల్యూపీఐ 1.81 శాతంగా ఉంది. రిటైల్​ ద్రవ్యోల్బణం జులైలో 6.93 శాతానికి పెరిగింది.

WPI inflation
ఆహార ధరలు పెరిగినా టోకు ద్రవ్యోల్బణం డౌన్
author img

By

Published : Aug 14, 2020, 5:20 PM IST

Updated : Aug 14, 2020, 9:58 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) జులైలో స్వల్పంగా తగ్గింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలైలో డబ్ల్యూపీఐ 0.58 శాతం క్షీణించింది. ఆహార పదార్థాల ధరలు పెరిగినా.. ఇంధన, విద్యుత్తు ధరలు తగ్గడం వల్ల ఈ స్థాయిలో టోకు ద్రవ్యోల్బణం దిగొచ్చినట్లు తెలుస్తోంది.

అధికారిక లెక్కల ప్రకారం 2020 జూన్​లో టోకు ద్రవ్యోల్బణం 1.81 శాతంగా, గతేడాది జులైలో 1.17 శాతంగా ఉంది.

ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్​ (2.04 శాతం)తో పోలిస్తే.. జులైలో 4.08 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ఇంధన, విద్యుత్​ ద్రవ్యోల్బణం 13.60 శాతం నుంచి 9.84 శాతానికి తగ్గింది.

తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం జులైలో 0.51 శాతానికి పెరిగింది. అంతకుముందు జూన్​లో ఇది 0.08 శాతంగా ఉంది.

రిటైల్​ ద్రవ్యోల్బణం జులైలో 6.93 శాతానికి పెరిగింది. అంతకుముందు జూన్​లో అది 6.23 శాతంగా ఉంది.

ఇదీ చూడండి:కరోనాకు చెక్​ పెట్టే ఫావిపిరవిర్‌ ట్యాబ్లెట్ రూ.33కే!

Last Updated : Aug 14, 2020, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details