తెలంగాణ

telangana

ETV Bharat / business

WPI inflation: జులైలోనూ దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం - టోకు ద్రవ్యోల్బణం తగ్గేందుకు కారణాలు

హోల్​ సేల్ ప్రైస్​ ఇండెక్స్​ (WPI inflation) జులైలో 11.16 శాతంగా నమోదైంది. జూన్​తో పోలిస్తే డబ్ల్యూపీఐ కాస్త తగ్గినప్పటికీ.. వరుసగా మూడో నెలలోనూ రెండంకెలపైనే ఉండటం గమనార్హం.

WPI
డబ్లూపీఐ

By

Published : Aug 16, 2021, 1:19 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI inflation) వరుసగా రెండో నెలలోనూ దిగొచ్చింది. అయినప్పటికీ వరుసగా మూడో నెలలోనూ రెండంకెల పైనే నమోదు కావడం గమనార్హం.

జులైలో టోకు ద్రవ్యోల్బణం 11.16 శాతంగా నమోదైనట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గత ఏడాది జులైలో ఇది -0.25 శాతంగా ఉన్నట్లు గుర్తు చేసింది. ఆహార పదార్థాల ధరలు కాస్త చల్లారడం వల్ల డబ్ల్యూపీఐ దిగొచ్చినట్లు తెలిపింది. అయితే తయారీ వస్తువులు, ముడి చమురు ధరలు మాత్రం ఇంకా అధికంగానే ఉన్నట్లు వివరించింది.

వివిధ ఉత్పత్తులపై ఇలా..

  • ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్​లో 3.09 శాతంగా ఉండగా.. జులైలో అది దాదాపు సున్నాకు తగ్గింది. ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గటం వరుసగా ఇది మూడో నెల. అయితే ఉల్లి ద్రవ్యోల్బణం మాత్రం అత్యధికంగా 72.01 శాతం వద్ద ఉంది.
  • పెట్రోలియం, సహజ వాయు ద్రవ్యోల్బణం మాత్రం జూన్​తో పోలిస్తే జులైలో 36.34 శాతం నుంచి 40.28 శాతానికి పెరిగింది.
  • తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం కూడా జూన్​తో పోలిస్తే.. గత నెల స్వల్పంగా పెరిగి.. 10.88 శాతం నుంచి 11.20 శాతానికి చేరింది.

జాతీయ గణాంక కార్యాలయం గత వారం విడుదల చేసిన డేటాలో.. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.59 శాతంగా నమోదైనట్లు తెలిసింది.

ఇదీ చదవండి:ఎస్​బీఐ ప్రత్యేక ఆఫర్లు- వాటిపై 70% డిస్కౌంట్​!

ABOUT THE AUTHOR

...view details