తెలంగాణ

telangana

ETV Bharat / business

కంపెనీల చట్టాన్ని మరింత సులభతరం చేస్తాం: మోదీ

దేశంలో వాణిజ్యం సజావుగా జరిగేలా ఎన్డీఏ సర్కారు ఎన్నో సంస్కరణలు చేపట్టిందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. అసోచామ్​ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. కంపెనీల చట్టంలోని చాలా నిబంధనల్లో క్రిమినల్​ చర్యలను తొలగించి వాణిజ్యాన్ని సులభతరం చేస్తామన్నారు.

మోదీ
మోదీ

By

Published : Dec 20, 2019, 12:53 PM IST

Updated : Dec 20, 2019, 3:14 PM IST

కంపెనీల చట్టాన్ని మరింత సులభతరం చేస్తాం

ఎన్డీఏ ప్రభుత్వంలో సులభతర వాణిజ్యంలో భారత్​ దూసుకుపోతోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో వ్యాపార అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు, జీఎస్టీలో అవసరానికి తగిన మార్పులు చేశామన్నారు.

అసోచామ్​ ఏర్పాటై వందేళ్లు అయిన సందర్భంగా దిల్లీలో జరిగిన కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై ప్రసంగించారు.

"ఐదారేళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లింది. మా సర్కారు వచ్చాక అందులోనుంచి బయట పడేసి క్రమశిక్షణ అలవరిచాం. సులభతర వాణిజ్యంలో 190 దేశాల్లో భారత్​ 149 ర్యాంకులో ఉండేది. మూడేళ్ల తర్వాత 63కు వచ్చింది. కంపెనీల చట్టంలో చిన్న చిన్న తప్పులకూ క్రిమినల్​ చర్యలు ఉండేవి. ఇవే మీ ఆందోళనకు కారణం. అటువంటి ఎన్నో నిబంధనలను క్రిమినల్​ చర్యల నుంచి మినహాయించాం. మరిన్ని నిబంధనలను పరిశీలిస్తున్నాం."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: 'నిజాం నిధుల కేసులో పాకిస్థాన్​కు మరో ఎదురుదెబ్బ'

Last Updated : Dec 20, 2019, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details