తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్లపై ఎస్​బీఐ కీలక ప్రకటన!

అన్ని రకాల వడ్డీ రేట్లను వీలైనంత వరకు స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ ఛైర్మన్ దినేశ్​ కుమార్​ ఖారా వెల్లడించారు. కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో వృద్ధికి ఊతమందించే దిశగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బ్యాంకులపై కొవిడ్​-19 రెండో దశ ప్రభావం ఎంతలా ఉందనే విషయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు.

No change in SBI interest rates for some time
ఎస్​బీఐ వడ్డీ రేట్లు ఇక యథాతథం

By

Published : May 2, 2021, 3:09 PM IST

అన్ని రకాల వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేసింది అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ (భారతీయ స్టేట్ బ్యాంక్). వృద్ధికి ఊతమందించే చర్యలో భాగంగా వడ్డీ రేట్లను వీలైనంత కాలం స్థిరంగా ఉంచనున్నట్లు ఎస్​బీఐ ఛైర్మన్​ దినేశ్​ కుమార్ ఖారా పేర్కొన్నారు.

ప్రస్తుతం లాక్​డౌన్​, ఇతర చర్యలు దేశవ్యాప్తంగా కానందున బ్యాంక్​ ఎన్​పీఏలపై కరోనా రెండో దశ ప్రభావం ఎంత ఉంటుందనేది ఇప్పుడే అంచనా వేయలేమని పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా లాక్​డౌన్ ప్రభావం వేరువేరుగా ఉన్నందున ఇంకొంత సమయం తీసుకుని బ్యాంకులపై దాని ప్రభావం గురించి ఓ అంచనాకు రానున్నట్లు వివరించారు.

తాత్కాలిక ఆస్పత్రులు..

కొవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఐసీయూ సదుపాయాలతో (50) కూడిన వెయ్యి పడకల తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఖారా వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.30 కోట్లు కేటాయించినట్లు. ఈ విషయంలో వివిధ లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థలు, ఆస్పత్రి యాజమాన్యాలతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు.

ఎస్​బీఐలో మొత్తం 2.5 లక్షల ఉద్యోగులకు గానూ.. ఇప్పటికే 70 వేల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఖారా వివరించారు. మిగతా ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్​ ఇప్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకయ్యే ఖర్చును బ్యాంకే భరిస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:హోం లోన్​ వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్​బీఐ

ABOUT THE AUTHOR

...view details