తెలంగాణ

telangana

ETV Bharat / business

RBI: 'ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమిస్తాం'

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆర్​బీఐ. ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమివ్వాల్సిన అవసరం ఉందన్నారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​.

RBI Governor
ఆర్​బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

By

Published : Aug 21, 2021, 2:35 PM IST

కరోనా మూలంగా తలెత్తిన ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమివ్వాల్సిన అసవరం ఉందని 'రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)' గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ఆగస్టు 4-6 మధ్య జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాలు శుక్రవారం విడుదలయ్యాయి. కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.

కమిటీ సమావేశంలో చర్చించిన అంశాల పూర్తి సమాచారం తాజాగా 'మినిట్స్‌' ద్వారా బయటకు వచ్చాయి. దీని ప్రకారం ఆర్బీఐ ముందు రెండు ప్రధాన మార్గాలున్నాయని శక్తికాంతదాస్‌ అభిప్రాయపడ్డారు. ఒకటి దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతును కొనసాగించడం కాగా.. మరొకటి మళ్లీ విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం ఇంకా నెమ్మదిగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. దేశీయంగా గిరాకీ పుంజుకుంటున్నప్పటికీ.. అదీ నెమ్మదిగానే ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెపో, రివర్స్‌ రెపో రేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

గతేడాది నుంచి రెపో, రివర్స్‌ రెపో రేట్లను ఆర్‌బీఐ యథాతథంగానే ఉంచుతూ వస్తోంది. ఈ నెలలో జరిగిన సమీక్షలోనూ వాటి జోలికి వెళ్లలేదు. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుండడం ఆర్బీఐని కలవరపరుస్తోంది. దీంతో ద్రవ్య విధానాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ద్రవ్య వ్యవస్థలో కరెన్సీ ప్రవాహాన్ని ఆర్‌బీఐ రెపో, రివర్స్‌ రెపో రేటుల సవరణ ద్వారానే నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. కానీ కరోనా కారణంగా రెపో రేటును తగ్గిస్తూ పోయిన ఆర్బీఐ.. చాలాకాలం నుంచి వాటిని తాకడం లేదు. ఫలితంగా అటు రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఇటు హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం తిరిగి పెరుగుతున్నాయి. అయినప్పటికీ వృద్ధికి ఊతమిస్తామని శక్తికాంతదాస్‌ చెబుతుండడం గమనార్హం.


ఇదీ చూడండి:'క్రమంగా గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థ'

వాట్సాప్​ పేమెంట్స్ ఇక​ మరింత ఆకర్షణీయం!

ABOUT THE AUTHOR

...view details