ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో ఆగస్టు 4న ప్రారంభమైన సమావేశం గురువారం ముగియనుంది. అనంతరం సమీక్షలో తీసుకున్న నిర్ణయాలపై ఆర్బీఐ ప్రకటన చేయనుంది.
సమీక్ష నిర్ణయాల్లో రెపో రేటు తగ్గింపుపై భారీ అంచనాలు ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతలను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తగ్గించే అవకాశం..
అయితే ద్రవ్యోల్బణం పెరిగినా వడ్డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్ల తగ్గిస్తుందని క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. రెపోరేటు 25 బేసిస్ పాయింట్లు, రివర్స్ రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని మరో రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ అభిప్రాయపడింది.