తెలంగాణ

telangana

ETV Bharat / business

'దైవదూతగా ఆర్థిక మంత్రే సమాధానం ఇస్తారా?' - act of god

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం. కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను యాక్ట్​ ఆఫ్​ గాడ్​గా పేర్కొనటంపై మండిపడ్డారు. మహమ్మారి రాకముందు ఆర్థిక వ్యవస్థ దుస్థితిపై దైవదూతగా ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారా? అని ప్రశ్నించారు.

Chidambaram
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం

By

Published : Aug 29, 2020, 12:39 PM IST

కరోనా సంక్షోభంతో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను 'యాక్ట్​ ఆఫ్​ గాడ్​'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​పై కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా మహమ్మారికి ముందు ఆర్థిక వ్యవస్థ ఎలా దుర్నిర్వహణకు గురైందో దైవదూతగా ఆర్థిక మంత్రి వివరిస్తారా? అన్ని ప్రశ్నించారు.

" కరోనా మహమ్మారి యాక్ట్​ ఆఫ్​ గాడ్​ అయితే.. భారత్​లోకి వైరస్​ రాకముందు 2017-18, 2018-19, 2019-20 ఏడాదిల్లో ఆర్థిక వ్యవస్థ ఎందుకు స్తంభించిపోయింది. దైవదూతగా ఆర్థిక మంత్రి సమాధానం చెప్తారా?

- పి. చిదంబరం, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి.

కేంద్రంపై విమర్శలు..

జీఎస్టీ బకాయిలు పెండింగ్​లో ఉన్నందున ఆదాయ నష్టాలను పూడ్చేందుకు ఎక్కువ రుణాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిండాన్ని తప్పుపట్టారు చిదంబరం. మోదీ ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదన్నారు. దీని ద్వారా రాష్ట్రాలపై ఆర్థిక భారం ఎక్కువవుతుందన్నారు. రాష్ట్రాల అధికారాలను కూడా కేంద్రమే తీసుకుంటుందని.. అది చట్టాలను ఉల్లంఘించటమే అవుతుందని ఆరోపించారు.

చిదంబరం ట్వీట్​

ఇదీ చూడండి:'భాజపా సర్కారు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఓ విషాదం'

ABOUT THE AUTHOR

...view details