తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్చిలో దిగొచ్చిన టోకు ద్రవ్యోల్బణం

ఆహార పదార్థాలు, కూరగాయల ధరల తగ్గుదలతో మార్చిలో టోకు ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. ఫిబ్రవరితో పోలిస్తే 2.26 శాతం నుంచి 1 శాతానికి దిగొచ్చినట్లు ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో వెల్లడైంది.

WPI inflation cools
టోకు ద్రవ్యోల్బణం

By

Published : Apr 15, 2020, 1:11 PM IST

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మార్చిలో భారీగా దిగొచ్చింది. ఆహార పదార్థాలు, కూరగాయల ధరల తగ్గుదలతో మార్చిలో 1 శాతానికి ద్రవ్యోల్బణం తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూపీఐ 2.26 శాతంగా ఉంది.

  • ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో 7.79 శాతం నుంచి 4.91 శాతానికి తగ్గింది.
  • కూరగాయల ద్రవ్యోల్బణం మార్చిలో 11.90 శాతానికి దిగొచ్చింది. ఫిబ్రవరిలో ఇది 29.97 శాతంగా ఉంది.
  • ఉల్లిపాయల ద్రవ్యోల్బణం మాత్రం మార్చిలోనూ అత్యధికంగా 112.31 శాతంగా నమోదైంది.
  • ఇంధన, విద్యుత్ విభాగాల్లో 1.76 శాతంగా, తయారీ రంగంలో 0.34 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది.

దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో గణాంకాల సేకరణపై కొంత ప్రభావం పడినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కారణంగా మార్చి నెల టోకు ద్రవ్యోల్బణం గణాంకాల్లో సవరణలకు అవకాశం ఉన్నట్లు వివరించింది.

ఇదీ చూడండి:క్రెడిట్ స్కోర్​ బాగుంటేనే జీవిత బీమా!

ABOUT THE AUTHOR

...view details