టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) స్వల్పంగా పెరిగింది. ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతంగా నమోదైనట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జులైలో టోకు ద్రవ్యోల్బణం 11.16 శాతంగా ఉంది. డబ్ల్యూపీఐ రెండంకెలపైన నమోదవడం వరుసగా ఇది ఐదో నెల కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 0.41 శాతంగా ఉంది.
డబ్ల్యూపీఐ పెరిగేందుకు కారణాలు..
- ఆహారేతర వస్తువులు, మినరల్ ఆయిల్స్, ముడి చమురు, సహజ వాయువు, తయారీ వస్తువుల ధరలు పెరగటం వల్ల ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది.
- ఆహార పదార్థాల టోకు ద్రవ్యోల్బణం మాత్రం వరుసగా నాలుగో నెలలోనూ తగ్గి.. ఆగస్టులో -1.29 శాతంగా నమోదైంది. జులైలో ఇది సున్నా శాతంగా ఉంది. ఉల్లి, పప్పు ధాన్యాల ధరలు పెరిగినా.. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం తగ్గటం విశేషం.
- ఉల్లి టోకు ద్రవ్యోల్బణం ఆగస్టులో 62.78 శాతానికి, పప్పు ధాన్యాల ధరలు 9.41 శాతం పెరిగాయని ప్రభుత్వ డేటా వెల్లడించింది.
- ముడి చమురు టోకు ద్రవ్యోల్బణం ఆగస్టులో 40.03 శాతానికి పెరిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో తయారీ వస్తువుల టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది.
ఇదీ చదవండి:దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం- ఆగస్టులో 5.3శాతం