తెలంగాణ

telangana

ETV Bharat / business

'భారత్​-అమెరికా మధ్య అద్భుత వాణిజ్య ఒప్పందం' - trade deal with India

భారత్​-అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వాణిజ్య ఒప్పందానికి అడ్డంకులు తొలగించే చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప ఒప్పందం కుదుర్చుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు.

We will have a great trade deal with India soon: Trump
'భారత్​-అమెరికా మధ్య అద్భుత వాణిజ్య ఒప్పందం'

By

Published : Feb 24, 2020, 4:27 PM IST

Updated : Mar 2, 2020, 10:01 AM IST

'భారత్​-అమెరికా మధ్య అద్భుత వాణిజ్య ఒప్పందం'

భారత్​తో అద్వితీయమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ధీమాగా చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అహ్మదాబాద్​ మోటేరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్​ కార్యక్రమం వేదికగా ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు​.

ఇరు దేశాల ఎగుమతులు, దిగుమతులు వృద్ధి దిశగా సాగుతున్నాయన్నారు ట్రంప్​. మోదీ ఇప్పటికే అనేక సంస్కరణలతో ముందుకెళ్తున్నారని.. సత్వర చర్యలతో వాణిజ్యంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.

"నా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాలను మరింత విస్తరించేందుకు ప్రధాని మోదీ, నేను చర్చించనున్నాం. ఇంతవరకు ఎన్నడూ లేనంత గొప్ప వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. అమెరికా, భారత్​ మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించే చర్చల తొలి దశలో ఉన్నాం. ఇరు దేశాలకు ఉపయోగపడే విధంగా ప్రధాని మోదీ, నేను కలిసికట్టుగా పని చేసి ఒక గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ఆశిస్తున్నా. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యంలో ఇటీవలి కాలంలో సుమారు 40 శాతానికిపైగా వృద్ధి నమోదైంది. అమెరికా ఎగుమతులకు భారత్​ ప్రధాన కేంద్రం. అలాగే భారత ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్​ "

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

అంతరిక్ష, శాస్త్రసాంకేతిక రంగంలోనూ భారత్​తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు ట్రంప్​. వ్యోమగాముల శిక్షణ, చంద్రయాన్​ ప్రయోగాల్లో సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి: '3 బిలియన్​ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం'

Last Updated : Mar 2, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details