తెలంగాణ

telangana

By

Published : Apr 23, 2021, 2:06 PM IST

ETV Bharat / business

18 ఏళ్లు దాటిన వారి టీకా ఖర్చు రూ.67,193 కోట్లు!

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ మానవాళికి ముప్పుగా తయారైంది. ఈ నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారందరికి టీకా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి రూ.67,193 కోట్లు ఖర్చు అవుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది.

Corona vaccine
కరోనా టీకా

దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కరోనా టీకా ఇచ్చేందుకు.. రూ.67,193 కోట్లు ఖర్చవుతుందని ఇండియా రేటింగ్స్​ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. ఇది దేశ జీడీపీలో కేవలం 0.36 శాతానికి సమానమని పేర్కొంది.

దేశంలో 133.26 కోట్ల మంది జనాభా ఉండగా.. అందులో 18 ఏళ్లు దాటిన వారు 84.19 కోట్లని తెలిపింది ఇండియా రేటింగ్స్. వీరందరికి టీకా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20,870 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిపి రూ.46,323 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించింది.

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ విస్ఫోటంలా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి మే 1 నుంచి కొవిడ్​ టీకా వేయాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇండియా రేటింగ్స్ టీకా ఖర్చుపై అంచనాలను విడుదల చేసింది.

ఆంక్షలపై ఆధారపడే వృద్ధి రేటు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22) భారత్ వృద్ధిరేటు 11 శాతంగా నమోదు కావచ్చని ఎస్ అడ్​ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాలలో వృద్ధిరేటు 6.1-6.49 మేర ఉండొచ్చని పేర్కొంది. లాక్​డౌన్ ఆంక్షల ప్రభావం ఎంత కాలం పాటు కొనసాగిస్తారనే దానిపై వృద్ధి రేటు ఆధారపడి ఉంటుందని తెలిపింది.

బీబీబీ- రేటింగ్ కొనసాగింపు..

కరోనా మలిదశ కారణంగా భారత ఆర్ధిక రికవరీ ఆలస్యం కావొచ్చని.. అయితే పట్టాలు మాత్రం తప్పదని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అదే సమయంలో 'ప్రతికూల భవిష్యత్ అంచనాలతో సార్వభౌమ రేటింగ్​ను 'బీబీబీ-'గా కొనసాగించింది. 2021-22లో భారత్​ జీడీపీ 12.8 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని.. ఆ తర్వాతి ఏడాది 5.8 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది.

ఇదీ చదవండి:కొవిడ్‌-19 టీకా తయారీకి ఐఐఎల్‌ సన్నాహాలు

ABOUT THE AUTHOR

...view details