ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగం (ఏప్రిల్-సెప్టెంబర్)లో భారత్ అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఆకర్షించిన రెండో అతిపెద్ద దేశంగా అమెరికా నిలిచింది.
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అమెరికా నుంచి భారత్ 7.12 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను పొందింది. గత ఏడాది ఇదే సమయంలో రెండో స్థానంలో ఉన్న.. మారిషస్ నుంచి ఈ సారి 2 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు మాత్రమే వచ్చాయి. దీనితో మారిషస్ 4వ స్థానానికి పడిపోయింది.
డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం తెలిసింది.