తెలంగాణ

telangana

ETV Bharat / business

'అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది.. కానీ'

కరోనాతో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్త చేసింది ఆ దేశ కేంద్రీయ బ్యాంకు ఫెడరల్​ రిజర్వ్. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో కోలుకోవచ్చని తెలిపింది. సంక్షోభం తీవ్రతను తగ్గించే ప్రణాళికలు ప్రభుత్వం వద్ద ఉండటం మంచి విషయమని, నిరుద్యోగం తగ్గి.. ప్రజలు పనుల్లోకి వెళతారని విశ్లేషించింది.

US economy
'అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది..కానీ'

By

Published : May 18, 2020, 12:06 PM IST

కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు అగ్రరాజ్య కేేంద్రీయ బ్యాంకు 'ఫెడరల్​ రిజర్వ్'​ ఛైర్మన్​ జెరోమ్​ పావెల్​. అయితే.. అది వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో కోలుకోవచ్చన్నారు. వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యక్తిగతంగా కానీ, బృందంగా కానీ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

" ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ప్రజలు పనుల్లోకి తిరిగి వెళతారు. దేశంలో నిరుద్యోగం తగ్గుతుంది. దాని ద్వారా ప్రయోజనం పొందుతాం. కానీ అది జరగడానికి కాస్త సమయం పడుతుంది. వచ్చే ఏడాది చివరి వరకు సాధ్యమవుతందనుకుంటున్నా. అనుకున్న సమయానికన్నా ముందే జరుగుతుందనే నమ్మకముంది.

మనం చేయగలిగిన దాంట్లో ప్రధానమైంది వైరస్​ వ్యాప్తిని కట్టడి చేయడమే. పనుల్లోకి వెళ్లిన సమయంలో జగ్రత్తలు పాటించాలి. ప్రజలు ఎక్కువ కాలం పనిలో లేనట్లయితే.. వారి నైపుణ్యాలు, శ్రామిక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక సంక్షోభంతో ప్రజల భవిష్యత్తుకు తీరని నష్టం వాటిల్లుతుంది. అయితే.. సంక్షోభ ప్రభావాలను తగ్గించే విధానాలు ఉండటం మంచి విషయం​. వైరస్​ను కట్టడి చేయటం ద్వారా వచ్చే 3-6 నెలల్లో ప్రజలు, వ్యాపారాలు దివాలా నుంచి కోలుకుంటాయి."

– జెరోమ్​ పావెల్​, ఫెడరల్​ రిజర్వ్​ ఛైర్మన్​

దేశంలో నిరుద్యోగం ఎంత మేర ఉంటుందో చెప్పలేమన్నారు పావెల్​. ఈనెల, వచ్చే నెలలో ఎక్కువగా ఉద్యోగాల తొలగింపులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. రెండు నెలల వ్యవధిలోనే సుమారు 20 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. రెండు నెలల క్రితం నిరుద్యోగం రేటు 50 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ 60 రోజుల్లోనే భారీగా పెరగటం విచారకరమన్నారు. ఆర్థిక వ్యవస్థ త్వరితగతంగా పుంజుకుని ప్రజలు పనుల్లోకి వెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details