తెలంగాణ

telangana

ETV Bharat / business

సరికొత్తగా 'యూపీఐ'- ఇంటర్నెట్​ లేకుండానే మనీ ట్రాన్స్​ఫర్ - GOOGLE PAY

UPI payments for feature phones: డిజిటల్​ చెల్లింపులను విస్తృతం చేసేందుకు.. కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ దిశగా రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా.. కీలక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఫీచర్​ ఫోన్లలోనూ యూపీఐ ఆప్షన్​ను తీసుకొచ్చింది. దీనితో ఇంటర్నెట్​ లేకుండానే.. ఫీచర్​ ఫోన్లలో యూపీఐ సేవల్ని కస్టమర్లు వినియోగించుకోవచ్చు.

UPI payments for feature phones
UPI payments for feature phones

By

Published : Mar 8, 2022, 1:57 PM IST

UPI payments for feature phones: ఫీచర్​ ఫోన్లు వాడే వారికి గుడ్​న్యూస్​. ఇక ఈ ఫోన్లతోనూ డిజిటల్​ చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ మేరకు 'యూపీఐ123పే' పేరుతో యూపీఐ సేవల్ని ప్రారంభించింది భారతీయ రిజర్వ్​ బ్యాంకు(ఆర్​బీఐ).

స్మార్ట్​ఫోన్​ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ లావాదేవీలు జరుపుకునేందుకు వీలుగా ఈ సేవల్ని తీసుకొచ్చినట్లు తెలిపారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. గత 3 సంవత్సరాలుగా డిజిటల్​ చెల్లింపులకు ఊతం ఇచ్చేందుకు ఆర్​బీఐ విశేషంగా కృషిచేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే సైబర్​ సెక్యూరిటీపై దృష్టి సారించాలని, ఎలాంటి ప్రతికూలతలు తలెత్తకుండా అన్నింటికీ సిద్ధపడేలా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

డిజిటల్​ చెల్లింపుల కోసం 'డిజిసాథీ' అనే 24x7 హెల్ప్​లైన్​ను కూడా ఆవిష్కరించారు దాస్​.

ఇంటర్నెట్​ లేకుండానే..

  • ఫీచర్​ ఫోన్లలో యూపీఐ123పేతో చెల్లింపులు చేసేందుకు ఇంటర్నెట్​ అవసరం లేదు.
  • స్కాన్​ లావాదేవీలు మినహా అన్ని ట్రాన్సాక్షన్స్​ చేసే వీలుంటుంది.
  • ఈ సౌలభ్యం పొందాలంటే కస్టమర్లు.. తమ బ్యాంకు అకౌంట్​ను ఫీచర్​ ఫోన్​కు లింక్​ చేయాల్సి ఉంటుంది.

యూపీఐ ఆధారిత చెల్లింపులు 2016లోనే అందుబాటులోకి వచ్చాయి. కానీ.. ఇది స్మార్ట్​ఫోన్లకే పరిమితమైంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు చాలా వరకు ఫీచర్​ ఫోన్లను వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి అవసరాల కోసం.. ఆ తరహా మొబైల్స్​లోనూ యూపీఐ పేమెంట్స్​ చేసుకునేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది కేంద్ర బ్యాంకు.

ఇవీ చూడండి:అదే జరిగితే.. మల్టీప్లెక్స్​ వ్యాపారంలో ఇక వాటిదే హవా!

చుక్కలు చూపిస్తున్న చమురు.. బంగారం భగభగ

ABOUT THE AUTHOR

...view details