కరోనా కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు.. ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ విధి విధానాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు వెల్లడించనున్నారు.ఈ మేరకు దిల్లీలో సాయంత్రం 4 గం.కు కేంద్ర ఆర్థికమంత్రి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్యాకేజీలో వివిధ రంగాలకు నిధుల కేటాయిపు, ఆయా రంగాలకు ప్యాకేజి వల్ల కలిగే ప్రయోజనాలు, ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై వివరణ సహా, రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు
ప్యాకేజీపై సర్వత్రా ఉత్కంఠ- నిధుల కేటాయింపు ఎలా? - package announcement by nirmala
నిర్మల
11:09 May 13
10:49 May 13
సాయంత్రం 4 గంటలకు నిర్మల మీడియా సమావేశం
- సాయంత్రం 4 గం.కు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం.
- ప్రధాని ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వివరాలను వెల్లడించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి.
Last Updated : May 13, 2020, 11:39 AM IST