తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆన్​లైన్​లో షాపింగ్ చేస్తున్నారా? ఇది మీ కోసమే - Safe Shopping

కొన్నేళ్ల క్రితం ఏదైనా కొనాలంటే.. ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్లి కొనుగోలు చేసేవాళ్లం. అయితే ప్రస్తుతం ఈ కామర్స్ వ్యాపారాల విస్తరణతో ఏం కావాలన్నా స్మార్ట్ ఫోన్​లోనే కొనుక్కొవచ్చు. వాటిని నేరుగా ఇంటికే వాటిని తెప్పించుకోవచ్చు. అయితే వీటి వల్ల కొన్ని సార్లు అవసరమైన వాటితో పాటు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు చాలా మంది. అలా జగరకుండా ఆన్​లైన్ షాపింగ్​లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోండి.

ఆన్​లైన్​లో షాపింగ్

By

Published : Jul 21, 2019, 5:46 AM IST

ఆన్​లైన్ షాపింగ్​లో ఆకర్షించే ఆఫర్లు.. ఆకట్టుకునే వస్తువులు దర్శనమిస్తుంటాయి. అయితే వీటీ మాయలో పడితే జేబుకు చిల్లు పడాల్సిందే. అలా జరగకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు మీ కోసం.

ఏది కావాలో అది మాత్రమే కొనాలంటే..

షాపింగ్ చేసేముందు చాలా మంది అనుకరించే పద్ధతులు రెండు. ఏం కొనాలో ముందే నిర్ణయించుకుని షాపింగ్ చేయడం. రెండోది ఏం ఉన్నాయో తెలసుకుని షాపింగ్ చేయడం.

ఇందులో మొదటి పద్ధతిలో కావాల్సిన దాని కోసం మాత్రమే వెతుకుతారు కాబట్టి ఆ వస్తువు మాత్రమే కొనుగోలు చేస్తారు.. అనవసర కొనుగోళ్లకు ఎక్కువగా అవకాశం ఉండదు. అయితే రెండో పద్ధతిలో మాత్రం అనవసర కొనుగోళ్లకు ఎక్కువ అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఏం కావాలో తెలియకుండా ఆన్​లైన్​ షాపింగ్ చేయాలనుకుంటే.. ఈ కామర్స్ కంపెనీలు చూపే ఆఫర్ల ఉచ్చులో పడే అవకాశం ఉంది. తద్వారా అవసరం ఉన్నదాని కన్నా ఎక్కవకొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది.

ఇలా చేయండి

మొదటి పద్ధతిలో కూడా కొనుగోళ్లు జరిపిన తర్వాత వెంటనే బిల్లు చెల్లించకుండా.. మరో సారి అ వస్తువు అవసరం ఎంత? ఇతర సంస్థలు ఆ వస్తువులు ఎంతకు ఇస్తున్నాయి అనే విషయాన్ని ఒకటికి రెండు సార్లు పరిశీలించండి. ఇలా రెండో సారి ఆలోచించడం కారణంగా ఖచ్చితంగా అవసరమున్న వస్తువునే కొనుగోలు చేస్తారు.
అఫర్లున్నాయని వస్తువు కొనడం కాదు.. అవసరమున్న వస్తువులను ఆఫర్​లో కొనాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పేమెంట్​ ఎలా చేయాలంటే?

ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపేప్పుడు క్యాష్ ఆన్ డెలివరీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దీని ద్వారా ఆన్​లైన్​లో పేమెంట్ సంబంధిత మోసాల బారిన పడకుండా ఉండొచ్చు.

ఒక వేళ క్యాష్ బ్యాక్ లాంటి ఆఫర్లు ఉంటే కార్డు ద్వారా చెల్లింపులు చేయాలి. అందులోనూ తక్కువ మొత్తాలు ఉన్న కార్డునే చెల్లింపులకు వాడటం మంచిది. ఒక వేళ ఏదైన మోసం జరిగితే.. అధిక నష్టం జరగకుండా భయటపడొచ్చు.

ఇదీ చూడండి: చిరు వ్యాపారులూ... మీ బడ్జెట్​ ఇలా ఉందా?

ABOUT THE AUTHOR

...view details