తెలంగాణ

telangana

By

Published : May 3, 2021, 5:25 PM IST

ETV Bharat / business

'టీకా విషయంలో జాతీయవాదం తగదు'

కరోనా టీకా విషయంలో దేశాలకు జాతీయవాదం ఉండకూడదన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఏడీబీ వార్షిక సమావేశంలో మట్లాడిన ఆమె​ కొవిడ్​ను ఎదుర్కొనేందుకు దేశాల మధ్య బహుపాక్షిక ఒప్పందాలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

To control Corona it requires vaccine technology sharing
టీకా టెక్నాలజీ విషయంలో పారదర్శకత అవసరం

కరోనా వ్యాక్సిన్​ సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోవడంలో అన్ని దేశాలు ఉదారంగా వ్యవహరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కోరారు. కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో టీకా జాతీయవాదం ఉండకూడదని ఆమె సూచించారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) వార్షిక సమావేశంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్​ ఈ విషయాలు పేర్కొన్నారు.

కొవిడ్​-19ను ఎదుర్కొనేందుకు దేశాల మధ్య బహుపాక్షిక ఒప్పందాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు నిర్మల.

ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్​ఎంఈ) వెన్నెముకలాంటివని అభివర్ణించారు విత్త మంత్రి. అందుకే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం రుణ సాయం గడువు పెంచినట్లు గుర్తు చేశారు. వివిధ రంగాలకు కూడా ఆర్థిక ప్రోత్సాహకాన్ని పెంచినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:త్వరలో దేశీయ వినియోగానికి 'ఫైజర్'​ టీకా?

ABOUT THE AUTHOR

...view details