జులైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మళ్లీ రూ.లక్ష కోట్ల మార్క్ దాటాయి. జీఎస్టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,16,393 లక్షల కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది. గత ఏడాది జులైతో పోల్చితే ఈ మొత్తం 33 శాతం ఎక్కువని పేర్కొంది.
పెరిగిన జీఎస్టీ వసూళ్లు- జులైలో రూ.లక్ష కోట్లపైకి - 2021 జులై జీఎస్టీ వసూళ్లు
జీఎస్టీ వసూళ్లు మళ్లీ పుంజుకున్నాయి. జులైలో రూ.లక్ష కోట్లపైన నమోదయ్యాయి. 2020 జులైతో పోలిస్తే.. గత నెల జీఎస్టీ ఆదాయం 33 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
జీఎస్టీ వసూళ్ల లెక్క
వసూళ్లు ఇలా..
- కేంద్ర జీఎస్టీ రూ.22,197 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ రూ.28,541 కోట్లు
- సమీకృత జీఎస్టీ రూ.57,864 కోట్లు
- సెస్ రూ.815 కోట్లు
ఇదీ చదవండి:4 నెలల్లో రూ.31 లక్షల కోట్ల సంపద వృద్ధి