తెలంగాణ

telangana

ETV Bharat / business

2020-21 వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్​ఓ క్లారిటీ! - ఈపీఎఫ్​ఓ లేటెస్ట్​ న్యూస్​

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ రేట్ల జమ ఆలస్యంపై ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని.. త్వరలోనే వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొంది.

EPF Interest credit soon
త్వరలోనే ఈపీఎఫ్​ వడ్డీ జమ

By

Published : Aug 11, 2021, 1:00 PM IST

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు కీలక విజ్ఞప్తి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. 6 కోట్ల లబ్దిదారులకు వడ్డీని త్వరలోనే జమ చేయనున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేట్ల జమ గురించిన ప్రక్రియ కొనసాగుతోందని.. అప్పటి వరకు చందాదారులు సహనం పాటించాలని ట్విట్టర్​ ద్వారా కోరింది. వడ్డీ జమ ఆలస్యంపై పలువురు ఈపీఎఫ్​ఓను ప్రశ్నించగా.. ఈ వివరణ ఇచ్చింది.

వడ్డీ రేట్లు ఇలా..

2020-21 ఆర్థిక సంవత్సరానికి చందాదారులకు 8.5 శాతం వడ్డీ రేటును చెల్లించాలని నిర్ణయించింది ఈపీఎఫ్ఓ​.

2018-19 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్​పై వడ్డీ రేటు 8.65 శాతం ఉండగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ధర్మకర్తల బోర్డు దాన్ని 8.5 శాతానికి తగ్గించింది. అంతకు ముందు ఏడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్ప వడ్డీ రేటు. కరోనా కారణంగానే.. 2020-21 వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని ఈపీఎఫ్​ఓ వివరించింది.

వడ్డీ జమ అయిన వెంటనే..చందాదారులంతా.. నాలుగు మార్గాల ద్వారా ఆ వివరాలను తెలుసుకునే వీలుంది. అయితే ఇందుకు వారి యూఏఎన్​ యాక్టివేట్ అయ్యుండాలి అనే విషయం గుర్తుంచుకోవాలి.

వడ్డీ జమ, ప్రస్తుత బ్యాలెన్స్​ తెలుసుకునే మార్గాలు..

మిస్డ్​​ కాల్​ సర్వీస్​..

ఈపీఎఫ్​ఓ వద్ద రిజిస్టర్​ అయిన మొబైల్​ నంబర్​ నుంచి '011-22901406' నంబర్​కు మిస్డ్​ కాల్ ఇవ్వాలి. దీని ద్వారా ఈపీఎఫ్​ఓ నుంచి ఎస్​ఎంఎస్​ రూపంలో బ్యాలెన్స్​ వివరాలు అందుతాయి. ఇది ఉచిత సర్వీస్​. దీనిని వినియోగించుకోవాలంటే.. చందాదారుడు కేవైసీ పూర్తి చేసి ఉండాలి.

ఎస్ఎంఎస్ సర్వీస్​..

ఈపీఎఎఫ్​ఓ చందాదారులు.. EPFOHO UAN అని టైప్​ చేసి 7738299899 నంబర్​కు ఎస్​ఎంఎస్​ పంపడం ద్వారా కూడా.. బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

ఈపీఎఫ్​ఓ పోర్టల్​..

ఈపీఎఫ్​ఓ మెంబర్​ పోర్టల్​లో రిజిస్టర్​ అయిన చందాదారులు.. యూఏఎన్​ నంబర్​ పాస్​వర్డ్​తో లాగిన్ అవడం ద్వారా బ్యాలెన్స్​ వివరాలు తెలుసుకోవచ్చు. ఏ నెలలో ఎంత మొత్తం జమ అయ్యిందనే వివరాలు కూడా ఇందులో ఉంటాయి.

ఉమంగ్ యాప్​..

ఖాతా బ్యాలెన్స్​ సహా.. ఈపీఎఫ్​ఓ స్టెట్​మెంట్​ను ఉమంగ్​ మొబైల్ యాప్​ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్​లో ఎంప్లాయ్​ సెంట్రిక్​ సర్వీసెస్​పై క్లిక్​ చేసి.. వ్యూ పాస్​ బుక్​ ఆప్షన్​ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్ నంబర్​ను టైప్ చేసి.. రిజిస్టర్​ మొబైల్ నంబర్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా బ్యాలెన్స్​ వివరాలను చూడొచ్చు.

ఇదీ చదవండి:పీఎఫ్​ ఖాతాదారులకు ఆగస్టు 31 వరకే ఆఖరి ఛాన్స్​

ABOUT THE AUTHOR

...view details