వచ్చే ఐదేళ్లలో దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ 2.0 ప్రభుత్వ వందరోజుల పాలనలో అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
దేశ సుస్థిరాభివృద్ధి కోసం వంద లక్షల కోట్ల రూపాయలతో మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు నిర్మలా పేర్కొన్నారు. ఇందుకు కావలసిన ప్రాజెక్టులను గుర్తించేందుకు అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని చేపట్టినట్లు వివరించారు.