తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్రాక్టర్ల ఉత్పత్తిలో స్వరాజ్​ కీలక మైలురాయి

నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైన స్వరాజ్​ ట్రాక్టర్ల ఉత్పత్తి మొత్తం 15 లక్షలు దాటినట్లు మహీంద్రా కంపెనీ ప్రకటించింది.

స్వరాజ్​ ట్రాక్టర్ల ఉత్పత్తిలో మైలురాయి

By

Published : Apr 5, 2019, 7:08 AM IST

స్వరాజ్​ ట్రాక్టర్ల ఉత్పత్తి సంఖ్య 15 లక్షలు దాటినట్టు మహీంద్రా సంస్థ ప్రకటించింది. కొన్ని సంవత్సరాలుగా దేశీయ ట్రాక్టర్​ విపణిలో అత్యంత ఆదరణ పొందుతున్న సంస్థగా స్వరాజ్​ ఉందని తెలిపింది. మహీంద్రకు చెందిన అనుబంధ సంస్థే స్వరాజ్​.

నాలుగు దశాబ్దాల క్రితం స్వరాజ్​ ట్రాక్టర్ల తయారీని ప్రారంభించింది. గత సంవత్సరం లక్షా 20వేల ట్రాక్టర్లు ఉత్పత్తి చేసింది.

ఉత్పత్తి ప్రారంభించిన 28 సంవత్సరాలకు అంటే 2002లో 5 లక్షల ట్రాక్టర్లను ఉత్పత్తి చేసింది స్వరాజ్​. తరువాతి 5 లక్షల ట్రాక్టర్లను తయారుచేయటానికి 11 సంవత్సరాలు తీసుకుంది. 2013లో 10 లక్షల ఉత్పత్తి మైలు రాయిని చేరుకుంది. తర్వాతి 5 సంవత్సరాల్లో మరో 5లక్షల ట్రాక్టర్లను తయారు చేసింది. 15 లక్షల ట్రాక్టర్ల మైలురాయిని 44 సంవత్సరాల్లో చేరుకుంది ఈ దిగ్గజ సంస్థ.

స్వరాజ్​ ఉత్పత్తి, పరిశోధనాభివృద్ధి కేంద్రాలు పంజాబ్​లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ 15హెచ్​పీ నుంచి 65 హెచ్​పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details