- భారత ఏకీకృత నిధి నుంచి రాష్ట్రాలకు పరిహారాలను చెల్లించలేమని అటార్నీ జనరల్ తెలిపారు.
- జీఎస్టీ మండలి భేటీలో పరిహారం చెల్లింపులపై రాష్ట్రాలకు రెండు మార్గాలను సూచించారు.
- రాష్ట్రాలకు ప్రత్యేక విండోను ఏర్పాటు చేసి ఆర్బీఐ ద్వారా రూ.97 వేల కోట్లను సహేతుకమైన వడ్డీ రేటుకు అందించటం.
- ఈ ఏడాది మొత్తం రూ.2,35,000 కోట్ల జీఎస్టీ పరిహార అంతరాన్ని ఆర్బీఐతో సంప్రదించి రాష్ట్రాలు పొందాలి.
- ఈ ఆప్షన్లపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రాలకు 7 రోజుల గడువు ఇచ్చినట్లు ఆర్థిక కార్యదర్శి వెల్లడించారు. అయితే ఇది ఈ ఏడాదికే వర్తిస్తాయని స్పష్టం చేశారు.
జీఎస్టీ మండలి భేటీ: తీసుకున్న నిర్ణయాలు ఇవే.. - జీఎస్టీ మండలి సమావేశంలో చర్చాంశాలు
The 41st GST Council meeting on video conferencing has begun. The meeting has just one agenda for discussion making up for shortfall in states' revenues, sources said.

17:19 August 27
16:58 August 27
5 గంటలపాటు సుదీర్ఘ చర్చ..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ అయిన జీఎస్టీ మండలి సమావేశంలో రాష్ట్రాల పరిహారంపై సుదీర్ఘంగా చర్చించారు. బకాయిల చెల్లింపుల విషయంలో ఉన్న రెండు మార్గాలపై 5 గంటలపాటు సమాలోచనలు చేసినట్లు తెలిపారు నిర్మల. ఈ భేటీ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన లోటుపైనే చర్చించినట్లు స్పష్టం చేశారు.
- కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు భారీగా పడిపోయాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.65 లక్షల కోట్ల పరిహారం రాష్ట్రాలకు కేంద్రం చెల్లించింది. ఇందులో సెస్ ద్వారా రూ.95 వేల కోట్లు వసూలైనట్లు తెలిపారు.
- ప్రస్తుతం ఏప్రిల్- జులై కాలంలో మొత్తం రూ.1.5 లక్షల కోట్లు రాష్ట్రాలకు బకాయి పడ్డట్లు రెవెన్యూ కార్యదర్శి స్పష్టం చేశారు.
- అయితే చట్ట ప్రకారం రాష్ట్రాలకు ఐదేళ్లపాటు పరిహారం చెల్లించాల్సి ఉందని అటార్నీ జనరల్ భూషణ్ పాండే స్పష్టం చేశారు.
12:08 August 27
41వ జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మండలి 41వ సమావేశం ప్రారంభమైంది. కొవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ భేటీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
జీఎస్టీ అమలు వల్ల నష్టపోయిన ఆదాయానికి హామీ ఇచ్చినట్టుగా పరిహారాన్ని ఇవ్వాలనే అంశంపై ఈ సారి ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
దీనితోపాటు మార్కెట్ల నుంచి రుణాలు తీసుకోవడం, సెస్ రేట్లను పెంచడం, పరిహార సెస్లోకి మరిన్ని వస్తువులను చేర్చే అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నాయి.
ద్విచక్రవాహనాలపై జీఎస్టీ తగ్గించే అంశం కూడా చర్చకు రావచ్చని మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.