స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ అతి స్వల్పంగా 10 పాయింట్లు పెరిగి 46,263 వద్ద (జీవనకాల గరిష్ఠం) స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి జీవనకాల రికార్డు స్థాయి అయిన 13,567 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతల కారణంగా ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి సూచీలు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, ఎస్బీఐ వంటి షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునేందుకు మొగ్గు చూపడం కూడా మార్కెట్ల ఒడుదొడుకులకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 46,350 పాయింట్ల అత్యధిక స్థాయి, 45,841 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 13,590 పాయింట్ల గరిష్ఠ స్థాయి,13,447 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.