తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఆత్మనిర్భర్​ భారత్​కు 2021 పద్దు బాటలు..'

సంక్షోభంతో వచ్చిన అవకాశాన్ని కేంద్రం వినియోగించుకుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. దేశానికి దీర్ఘకాలంలో కావాల్సిన వృద్ధి కోసం.. సంక్షోభంలోనూ సంస్కరణలు చేపట్టినట్టు పేర్కొన్నారు. లోక్​సభ వేదికగా 2021 బడ్జెట్​పై చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు నిర్మల.

Stimulus plus reforms - an opportunity has been taken out of pandemic situation- FM Sitharaman in Lok Sabha
'సంక్షోభంలోనూ.. సంస్కరణలు చేపట్టాం'

By

Published : Feb 13, 2021, 10:41 AM IST

Updated : Feb 13, 2021, 12:09 PM IST

భారత దేశాన్ని 'ఆత్మనిర్భర్​'గా తీర్చిదిద్దే ప్రక్రియను.. 2021 బడ్జెట్​ వేగవంతం చేస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఉద్ఘాటించారు. దీర్ఘకాలానికి సంబంధించిన వృద్ధిని సాధించేందుకు.. కరోనా సంక్షోభంలోనూ సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. సంక్షోభం ద్వారా వచ్చిన అవకాశాలను ఉద్దీపనలు, సంస్కరణలతో సద్వినియోగం చేసుకున్నట్టు పేర్కొన్నారు.

2021 బడ్జెట్​పై చర్చలో భాగంగా.. లోక్​సభలో ప్రసంగించారు నిర్మల. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు.. ఆర్థికపరంగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్​ను చేర్చే విధంగా ఉన్నాయన్నారు.

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ నెల 1న రూ. 34.5 లక్షల కోట్లతో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి. ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ.. అన్ని రంగాల వారికి అండగా నిలిచినట్టు పేర్కొన్నారు.

మోదీ స్ఫూర్తితో..

జన్​సంఘ్​ సమయం నుంచి దేశంపై, భారతీయులపై భాజపా నమ్మకం ఉంచిందన్నారు. భారత యువత, వ్యాపార, నిర్వాహక నైపుణ్యంపై విశ్వాసం ఉండటం వల్లే.. వేరే దేశాల నుంచి విధానాలు తెచ్చుకుని ఇక్కడ అమలు చేయలేదన్నారు.ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్​ సీఎంగా మోదీ చేసిన సేవల నుంచి స్ఫూర్తిపొందే 2021 బడ్జెట్​ను రూపొందించినట్టు వెల్లడించారు.

ఈ తరుణంలో విపక్షాలపై విమర్శలు చేశారు నిర్మల. మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని.. బడా పెట్టుబడిదారుల కోసం కాదన్నారు.

ఇదీ చూడండి:-వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రోల్​ ధరలు

Last Updated : Feb 13, 2021, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details