తెలంగాణ

telangana

ETV Bharat / business

రాష్ట్రాల రుణాలు తగ్గుతున్నాయ్..

రాష్ట్రాలు రుణ పరిమితి కన్నా తక్కువగా తీసుకుంటున్నట్లు 'ఇక్రా రేటింగ్స్' నివేదిక వెల్లడించింది. రాష్ట్రపై భారం పెరిగిపోకుండా చూసుకునేందుకే ఈ విధంగా చేస్తున్నట్లు తెలిపింది.

States' borrowing cost begin to fall
రాష్ట్రాల రుణాలు తగ్గుతున్నాయ్..

By

Published : May 25, 2021, 8:17 PM IST

భారీ రుణాలు తీసుకునే రాష్ట్రాలు పరిమిత మొత్తం కన్నా తక్కువ తీసుకుంటున్నందు వల్ల, వాటి రుణ వ్యయం తగ్గిపోతోందని 'ఇక్రా రేటింగ్స్' నివేదిక వెల్లడించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ వేలంలో.. సగటు వడ్డీ రేటు 18 బేసిస్ పాయింట్లు తగ్గి 6.74కు చేరిందని తెలిపింది.

సోమవారం జరిగిన వేలంలో ఆరు రాష్ట్రాలు రూ.11,500 కోట్లు సేకరించాయి, ఇది కేటాయించిన మొత్తం రూ.14,600 కోట్ల కన్నా తక్కువ. ఇది సంవత్సరం క్రితంతో పోలిస్తే దాదాపు 37 శాతం తక్కువ. అంతేగాక ఈ వారంలో సూచించిన దానికంటే 21.2 శాతం తక్కువ. ప్రస్తుతం ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్రాభివృద్ధి రుణాల మధ్య సగటు వడ్డీరేటు వ్యత్యాసం 77 బేసిస్ పాయింట్లకు తగ్గి 6.74శాతం వద్ద ఉంది.

రాష్ట్రాల రుణ సేకరణ ఇలా..

  • గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తర్​ప్రదేశ్, బంగాల్​లు కలిపి రూ.9,600 కోట్లు సేకరించాలన్నప్పటికీ.. సోమవారం జరిగిన వేలంలో వెనక్కి తగ్గాయి.
  • తొలుత వేలంలో పాల్గొనేందుకు నిరాకరించిన బీహార్, కేరళ, సిక్కింలు రూ.4 వేల కోట్ల రుణాలు సేకరించాయి.
  • మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులు రూ.2,500 కోట్లు అప్పుగా తీసుకున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,07,300 కోట్లు జారీ కావాల్సి ఉండగా.. 44.3 శాతం తగ్గి రూ.59,700 మాత్రమే రాష్ట్రాలు రుణాలు స్వీకరించాయి.

ఇవీ చదవండి:రూ. 97 వేల కోట్ల రుణ ప్రతిపాదనకే ఆ రాష్ట్రాలు ఓటు

'రూ.68 లక్షల కోట్లకు రాష్ట్రాల అప్పులు'

ABOUT THE AUTHOR

...view details