తెలంగాణ

telangana

ETV Bharat / business

సోమవారం నుంచి పసిడి బాండ్ల ఇష్యూ - సార్వ భౌమ పసిడి బాండ్ల పూర్తి వివరాలు

సోమవారం నుంచి 2021-22 తొలి విడత సార్వభౌమ పసిడి బాండ్లు ఇష్యూకు రానున్నాయి. 21వ తేదీ వరకు సబ్​స్క్రిప్షన్​కు అందుబాటులో ఉండనున్నాయి. మే 25ను సెటిల్మెంట్ తేదీగా నిర్ణయించింది ఆర్థిక శాఖ.

gold bond subscription date
సార్వభౌమ పసిడి బాండ్లు

By

Published : May 13, 2021, 1:29 PM IST

2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి విడత సార్వభౌమ పసిడి బాండ్ల ఇష్యూ ఈ నెల 17 (సోమవారం) నుంచి 21 వరకు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి 25న బాండ్లు జారీ చేస్తామని వెల్లడించింది.

ఒక్కో గ్రాము ధర ఈ వారం చివరి 3 పని దినాల్లో ముగింపు ధర సరాసరిగా ఉంటుందని పేర్కొంది. డిజిటల్‌ పద్ధతిలో కొనుగోలు చేసేవారికి గ్రాముకు రూ.50 రాయితీ ప్రకటించింది.

ఏమిటీ సార్వభౌమ పసిడి బాండ్లు?

  • సార్వభౌమ పసిడి బాండ్లు(ఎస్​జీబీ) ప్రభుత్వం అందించే బాండ్లు లాంటివే.
  • ఎస్​జీబీలనూ గ్రాముల చొప్పునే తీసుకోవాల్సి ఉంటుంది.
  • ప్రభుత్వం తరఫున వీటిని ఆర్​బీఐ జారీ చేస్తుంది.
  • దేశీయంగా బంగారంపై పొదుపును మళ్లించేందుకు ఎస్​జీబీలను 2015లో ప్రవేశపెట్టారు.
  • వార్షికంగా 2.5 శాతం రాబడి అర్జించవచ్చు.
  • వడ్డీని ఆరు నెలలకు ఒక సారి బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తారు.
  • భౌతికంగా నగల్లో ఉండే మేకింగ్‌ ఛార్జీలు, స్వచ్ఛత, తరుగు లాంటి ఇబ్బంది వీటిలో ఉండదు.

ఇదీ చదవండి:మస్క్ యూటర్న్​- బిట్​కాయిన్​ 17% పతనం!

ABOUT THE AUTHOR

...view details