ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)కి సంబంధించి సిరీస్ 12 సార్వభౌమ పసిడి బాండ్లు సోమవారం (మార్చి 1) నుంచి ఇష్యూకు రానున్నాయి. గ్రాము ధర రూ.4,662గా నిర్ణయించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ). మార్చి 5 వరకు ఇవి సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటాయి. మార్చి 9 సెటిల్మెంట్ తేదీ.
ఏమిటీ సార్వభౌమ పసిడి బాండ్లు?
సార్వభౌమ పసిడి బాండ్లు(ఎస్జీబీ) ప్రభుత్వం అందించే బాండ్ల లాంటివే. ప్రభుత్వం తరఫున వీటిని ఆర్బీఐ జారీ చేస్తుంది. ఎస్జీబీలనూ గ్రాముల చొప్పునే తీసుకోవాల్సి ఉంటుంది.
2.5 శాతం రాబడి..
దేశీయంగా బంగారంపై పొదుపును మళ్లించేందుకు ఎస్జీబీలను 2015లో ప్రవేశపెట్టారు. ఇది భౌతిక బంగారం కొనుగోలుకు మంచి ప్రత్యామ్నాయమని నిపుణులు చెబుతుంటారు. వీటి ద్వారా భౌతికంగా బంగారం దాచిపెట్టుకోవటం వల్ల ఉన్న ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. వార్షికంగా 2.5 శాతం రాబడి అర్జించవచ్చు. వడ్డీని ఆరు నెలలకు ఒక సారి బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లిస్తారు. భౌతికంగా నగల్లో ఉండే మేకింగ్ ఛార్జీలు, స్వచ్ఛత, తరుగు లాంటి ఇబ్బంది వీటిలో ఉండదు.
ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని ఉపసంహరించుకునే(ఎగ్జిట్ ఆప్షన్) అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదా మెచ్యూరిటీ పీరియడ్లో ఉన్న బంగారం ధరకు ప్రకారమే అప్పటి ధర నిర్ణీతమౌతుంది.
ఒక వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టొచ్చు?