తొలిరోజు ఆర్థిక ప్యాకేజీ వివరాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 6 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్రం... రెండో రోజు వలస కూలీలు, రైతులు, మధ్యతరగతిపై వరాల జల్లు కురిపించింది. లాక్డౌన్తో చితికిపోయిన చిరు, వీధి వ్యాపారులకు దన్నుగా నిలిచింది. వలస కూలీల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసింది. వలస కార్మికులు, పట్టణ పేదల కోసం హౌసింగ్ పథకాన్ని తీసుకువచ్చింది. రైతులకు అదనపు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
వలస కూలీల కోసం...
- రానున్న రెండు నెలల పాటు అందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ.
- రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు అందజేత.
- రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా లబ్ధిదారులను గుర్తించి రేషన్ అందజేస్తాయి.
ఒకే రేషన్ కార్డు విధానం..
- ఆగస్టు నాటికి ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు విధానం అమలు. ఈ విధానంతో లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా.. రేషన్ సరకులు తీసుకునే వెసులుబాటు.
కొత్త పథకం..
వలస కార్మికులు, పట్టణ పేదల కోసం.. ప్రధాన మంత్రి ఆవాస యోజన కొత్త పథకం అమలు.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో చౌకగా అద్దె ఇళ్లు అభివృద్ధి.
చిరు, వీధి వ్యాపారులకు...
ముద్ర శిశు రుణాలు
- ముద్రా యోజన కింద శిశు రుణాలు తీసుకున్నవారికి వడ్డీ రేట్లలో సబ్సిడీ.
- 3 నెలల మారటోరియం తర్వాత 12 నెలల పాటు 2శాతం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్(వడ్డీరేట్లలో సబ్సిడీ) సౌలభ్యం.
- ఈ సబ్సిడీ ద్వారా రూ.1500 కోట్లు లబ్ధి చేకూరుతుందని అంచనా.
వీధి వ్యాపారులు
- కరోనా కారణంగా వీధి వ్యాపారులే తీవ్రంగా దెబ్బతిన్నారని నిర్మలా స్పష్టం.
- ఈ నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత వెంటనే వ్యాపారాలు ప్రారంభించే విధంగా రూ.5 వేల కోట్ల రుణ సదుపాయం.
- వ్యాపారులకు రూ.10 వేల పెట్టుబడి సాయం.
రైతులకు...
- రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా రాష్ట్రాలకు 6,700 కోట్ల పెట్టుబడి సాయం.
- సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగింపు.
- సన్నకారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు.
- గిరిజనులకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి.
- కిసాన్ కార్డుదారులకు రూ.25వేల కోట్ల రుణాలు.