ఆర్థిక లక్ష్యాల కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి కృషి చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో సార్వత్రిక బడ్జెట్‌కు ముందు నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు మంత్రి. ఆర్థిక వృద్ధికి కేంద్రం దిశా నిర్దేశం చేస్తుందని.. అందులో రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని కోరారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రం కలిసికట్టుగా కృషి చేస్తే తప్ప లక్ష్యాలను చేరుకోలేమని సీతారామన్ ఉద్ఘాటించారు. రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు పూర్తి మద్ధతు ఉంటుందని వెల్లడించారు.