తెలంగాణ

telangana

ETV Bharat / business

మాంద్యంపై దిక్కుతోచని స్థితిలో నిర్మల: కాంగ్రెస్ - ఆనంద్​ శర్మ

ఎగుమతులు, స్థిరాస్తి రంగాలకు ప్రోత్సాహాన్ని కల్పించే దిశగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ. 70 వేల కోట్ల ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేసింది విపక్ష కాంగ్రెస్. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే విషయంలో ఆర్థికమంత్రి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించింది. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి సమగ్ర ప్యాకేజీ అవసరమని అభిప్రాయపడింది.

మాంద్యంపై దిక్కుతోచని స్థితిలో నిర్మల: కాంగ్రెస్

By

Published : Sep 14, 2019, 6:42 PM IST

Updated : Sep 30, 2019, 2:45 PM IST

ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కాంగ్రెస్ విమర్శించింది. ఎగుమతులు, స్థిరాస్తి రంగాలకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రకటించిన రూ. 70 వేల కోట్ల ప్యాకేజీ ఎందుకూ సరిపోదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ.

"నేను ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భారత ఆర్థిక మంత్రికి స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆర్థిక వ్యవస్థ సరిగా నడిచేందుకు ఒక సమగ్ర ప్యాకేజీ అవసరం."

-ఆనంద్​ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించిన ఉద్దీపనల అనంతరం పరిస్థితి మరింత క్షీణించిందని... తాజా నిర్ణయాలు ఏ విధంగా సహాయపడలేవని పేర్కొన్నారు ఆనంద్ శర్మ.

ఇదీ చూడండి: రూ.70వేల కోట్ల ప్యాకేజీతో ఎగుమతులు, స్థిరాస్తికి ఊతం

Last Updated : Sep 30, 2019, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details