తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏప్రిల్​ నుంచి జీఎస్టీ రిటర్ను దాఖలుకు సరళీకరణ విధానం

వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రాకతో ప్రజల నెలవారీ ఖర్చులు 4 శాతం తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి సరళీకరించిన జీఎస్టీ రిటర్ను విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

GST
GST

By

Published : Feb 1, 2020, 11:54 AM IST

Updated : Feb 28, 2020, 6:29 PM IST

ఏప్రిల్​ నుంచి జీఎస్టీ రిటర్ను దాఖలుకు సరళీకరణ విధానం

ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి సరళీకరించిన జీఎస్టీ రిటర్న్ విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. జీఎస్టీని చారిత్రక సంస్కరణగా ​అభివర్ణించిన ఆమె... వస్తు సేవల పన్ను ప్రవేశంతో దేశం ఆర్థికంగా బలపడిందన్నారు.

లోక్​సభలో బడ్జెట్​ ప్రవేశపెట్టారు సీతారామన్​. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసిన జీఎస్టీకి ఆద్యుడిగా మాజీ ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్​ జైట్లీని కొనియాడారు నిర్మలా సీతారామన్​.

"ప్రతి వస్తువుపై క్రమంగా పన్ను తగ్గుతూ వచ్చింది. చాలా రేట్ల తగ్గింపుతో ఏటా రూ. లక్ష కోట్లు మేర వినియోగదారులు లాభపడ్డారు. మొత్తంగా చూస్తే 10 శాతం పన్ను రేట్లు తగ్గాయి. ఫలితంగా సగటు వ్యక్తి నెలవారీ ఖర్చులు 4 శాతం తగ్గాయి.

రెండేళ్ల కాలంలో కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు చేరారు. 40 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. 800 కోట్ల ఇన్​వాయిస్​ అప్లోడ్​ అయ్యాయి. 105 కోట్ల ఈ-వే బిల్లులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్​ నుంచి సరళీకరించిన జీఎస్టీ రిటర్న్ విధానాన్ని తీసుకొస్తాం."

- నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

బడ్జెట్​ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ఈ పద్దు​ ప్రజల ఆకాంక్షలను నెరవేరస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఆదాయ పెంపు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే విధంగా బడ్జెట్​ను రూపొందించామని స్పష్టం చేశారు.

Last Updated : Feb 28, 2020, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details