కరోనా కారణంగా రియల్టీ రంగ సెంటిమెంట్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ నిరాశావాదంగా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే రానున్న ఆరు నెలల్లో ఈ రంగంపై అంచనాలు సానుకూలంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. క్రమంగా పెరుగుతున్న డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది.
ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ సహా ఫిక్కీ, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్లు విడుదల చేసిన 'రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ3 2020 సర్వే'లో రియల్టీ రంగంపై పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
రియల్టీ రంగ సెంటిమెంట్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే.. 22 పాయింట్ల నుంచి 40 పాయింట్లకు పెరిగింది.