బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో సీనియర్ సిటిజన్స్‌కు అధిక వడ్డీతో హామినిచ్చే కొన్ని పెట్టుబడి పథకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)తో సహా కొన్ని అగ్ర బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల మధ్య కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లకు గరిష్టంగా 6.2% వడ్డీని అందిస్తున్నాయి.
కోవిడ్-19 మహమ్మారి మధ్య బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఈ వడ్డీ రేటు పరిస్థితుల్లో స్థిరంగా రెగ్యులర్ ఆదాయం కొసం చూస్తున్న సీనియర్ సిటిజన్లు ఎక్కువగా దెబ్బతిన్నారు. అయితే బ్యాంక్‌ల కన్నా పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలు అధిక వడ్డీ రేటును అందిస్తాయి. సీనియర్ సిటిజన్లు తమ కష్టపడి సంపాదించిన డబ్బుకు హామినిచ్చే కొన్ని పెట్టుబడి పథకాలు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)
ఈ పథకం పోస్టాఫీస్ నడుపుతున్న పొదుపు పథకం. సంవత్సరానికి 7.40% వడ్డీ రేటును ఈ పథకంలో అందిస్తుంది. ఈ ఎస్సీఎస్ఎస్‌కు 5 ఏళ్ల కాల పరిమితి ఉంది. దీనిని మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడానికి గరిష్ట పరిమితి రూ. 15 లక్షలు. త్రైమాసిక ప్రాతిపదికన అధిక స్థిర రాబడి, సాధారణ ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సరిపోతుంది. ఎస్సీఎస్ఎస్‌లో పెట్టుబడులు 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హులు.
సీనియర్ సిటిజన్లకు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) పథకం.
చాలా మంది సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎల్లప్పుడూ మంచి ఎంపికనే. బ్యాంక్ ఎఫ్‌డీలు నెలవారీ, త్రైమాసిక, అర్ధ, వార్షిక వడ్డీ రేటు చెల్లింపులను అందిస్తాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై ప్రత్యేక వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్లు 30 జూన్ 2021 వరకు అమలులో ఉన్నాయి.