ఆపద సమయంలో సరిపడా డబ్బు లేనట్లయితే రుణాల ద్వారా ఆ అవసరాన్ని తీర్చుకోవచ్చు. కొవిడ్ సమయంలో చాలా మందికి వేతనాల్లో కోత పడింది. మరికొంత మంది ఉద్యోగం కోల్పోయారు. అలాంటి వారంతా.. రుణాలను ఆశ్రయిస్తున్నారు. బంగారంపై రుణం ((Gold loan)), ఫిక్స్డ్ డిపాజిట్‌పై రుణం, వ్యక్తిగత రుణాలు (Personal loan).. అవసరానికి ఆదుకుంటాయి.
రుణాల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్ రుణం (Secured loans), మరొకటి అన్సెక్యూర్డ్ రుణం. తనఖా ద్వారా పొందితే వాటిని సెక్యూర్డ్ రుణాలు అంటారు. ఎలాంటి తనఖా లేకుండా పొందేవి అన్సెక్యూర్డ్ (Unsecured loans) రుణాలు.
ఫిక్స్డ్ డిపాజిటపై, బంగారంపై రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత రుణాన్ని అన్సెక్యూర్డ్ రుణంగా చెప్పొచ్చు.
ఫిక్స్డ్ డిపాజిట్ రుణాలు (loan against Fixed Deposits)
ఈ తరహా రుణాలను సులభంగా పొందవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్‌పై వస్తోన్న వడ్డీరేటు కంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేటుతో ఈ రుణాన్ని పొందవచ్చు. ప్రస్తుతం ఎఫ్డీ వడ్డీ రేట్లు 5.5-7 శాతం మధ్య ఉన్నాయి. కాబట్టి 6 నుంచి 6.5 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో ఎఫ్డీపై రుణం పొందవచ్చు.
బ్యాంకులిచ్చే రుణాల్లో దీనిని.. త్వరగా మంజూరయ్యేదిగా పరిగణించవచ్చు. ఇందులో వడ్డీ రేటు హోం లోన్ కంటే తక్కువగా ఉంటుంది. చాలా బ్యాంకులు, ఫినాన్స్ కంపెనీలు ప్రాసెసింగ్ ఫీజులు కూడా తీసుకోవు. అంతేకాకుండా ప్రీ పేమెంట్ ఛార్జీలు కూడా దాదాపు ఉండవు.
ఎఫ్డీలో దాదాపు 90 శాతం రుణంగా పొందొచ్చు. అంటే రూ. లక్ష ఎఫ్డీ ఉంటే అందులో.. రూ.90 వేలను రుణంగా పొందే వీలుంది. అయితే ఇది బ్యాంకును బట్టి మారుతుంది.
ఎఫ్డీపై రుణం తీసుకుంటే ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు. ఎఫ్డీ మెచ్యూరిటీ కంటే ముందే రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఏదైనా అత్యవసరం వల్ల ఎఫ్డీని.. మెచ్యూరిటీ కంటే ముందే ఉపసంహరించుకోవాల్సి వస్తే.. దానికి బదులు ఎఫ్డీపై రుణం తీసుకోవడం ఉత్తమమని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా అనవసర ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు.
గోల్డ్ లోన్