లాక్‌డౌన్ వల్ల రుణాలపై మారటోరియం విధించిన నేపథ్యంలో వడ్డీ మాఫీపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. బ్యాంకుల ఆర్థికస్థితిని దృష్టిలో ఉంచుకొని వడ్డీమాఫీ చేయటం సరైన నిర్ణయం కాదని ఆర్బీఐ పేర్కొనటంతో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ షాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి సమాధానం కోరింది. ఇందులో రుణాలపై వడ్డీమాఫీ, వడ్డీపై వడ్డీ రద్దు వంటి రెండు అంశాలు ఉన్నాయని పేర్కొంది.
ప్రస్తుతమున్న కిష్ట పరిస్థితుల్లో ఈఎంఐలపై మారటోరియం విధించి, మరోవైపు రుణాలపై వడ్డీ వేయడం తీవ్రమైన విషయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.