ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. వినియోగదారులకు పండుగ ఆఫర్లు (SBI Festive offers) ప్రకటించింది. క్రెడిట్ స్కోర్ అనుసంధానిత హోం లోన్స్ (SBI loan) వడ్డీ రేటును 45 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ఇప్పటి వరకు రూ.75 లక్షల వరకు హోం లోన్‌పై వడ్డీ రేటు 7.15 శాతంగా ఉంది. ఇకపై రుణం (SBI loan) మొత్తంతో సంబంధం లేకుండా.. వడ్డీ రేటు 6.70గా ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల 30 ఏళ్ల కాల పరిమితితో.. రూ.75 లక్షల రుణం తీసుకుంటే రూ.8 లక్షల వరకు వడ్డీ భారం తగ్గనుంది.