తెలంగాణ

telangana

ETV Bharat / business

'సాంసద్​ యోజన' పనులు 56 శాతమే పూర్తి - uttarakandh

గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం దానంతటదే వృద్ధి చెందుతుందని భావించి 2014లో  'సాంసద్​ ఆదర్శ్​ గ్రామ యోజన'ను అమలు చేసింది మోదీ ప్రభుత్వం. పార్లమెంటు సభ్యులకు వాటి బాధ్యత అప్పగించింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతున్నా.. మరికొన్ని చోట్ల అసలు మొదలవనేలేదు. తెలంగాణలో 'సాంసద్​ ఆదర్శ గ్రామాల' పనులు వేగంగా జరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాల్లో వెల్లడైంది.

'సంసద్​ యోజన' కింద 56 శాతం పనులే పూర్తి!!

By

Published : Jul 29, 2019, 3:48 PM IST

2014 అక్టోబర్​ 11న ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో ప్రారంభమైన 'సాంసద్​ ఆదర్శ్​ గ్రామ యోజన' కింద ఈ ఐదేళ్లలో 56 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని తాజా ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ పథకంలో భాగంగా ప్రతి పార్లమెంట్​ సభ్యుడు వెనుకబడిన గ్రామాల్ని ఎంపిక చేసుకుని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. జులై 3 వరకు వెబ్​సైట్​లో పొందుపరిచిన వివరాల ప్రకారం అభివృద్ధి పనుల కోసం 1,484 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసుకున్నారు ఎంపీలు.

ఇప్పటివరకు 1,297 గ్రామపంచాయతీల్లో 68 వేల 407 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కానీ అందులో​ 38,021 మాత్రమే పూర్తయ్యాయి.

పలు రాష్ట్రాల్లో సంపూర్ణం..

తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​, గుజరాత్​, మధ్యప్రదేశ్​, ఉత్తరాఖండ్​, తెలంగాణలో ఈ పథకం సంపూర్ణంగా అమలవుతోంది.

⦁ 159 గ్రామాల్లోని.. 5,282 ప్రాజెక్టుల్లో 4,591 పూర్తి చేసుకుంది తమిళనాడు.
⦁ తెలంగాణలో 45 గ్రామ పంచాయతీల్లోని 1765 ప్రాజెక్టుల్లో 893 ఇప్పటికే పూర్తయ్యాయి.
గుజరాత్​, మధ్యప్రదేశ్​లలోనూ 70 శాతానికి పైగా అభివృద్ధి పనులు పూర్తయ్యాయి.

ఈ రాష్ట్రాల్లో నెమ్మదిగా..

అరుణాచల్​ ప్రదేశ్​, బిహార్​, అసోం, హిమాచల్​ప్రదేశ్​, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్​లో ఈ పథకం నత్తనడకన సాగుతోంది.
అరుణాచల్​ ప్రదేశ్​లో అభివృద్ధికి ఎంపికైన 7 గ్రామాల్లోని 216 ప్రాజెక్టుల్లో 28 మాత్రమే పూర్తయ్యాయి. అసోం, బిహార్​లోనూ ఇవే ఫలితాలు పునరావృతమయ్యాయి.
హిమాచల్, కర్ణాటకలో 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.
హిమాచల్​ ప్రదేశ్​లో 14 గ్రామాల్లో 1,291 ప్రాజెక్టులు చేయాల్సి ఉండగా 420 మాత్రమే పూర్తయ్యాయి.

కాలు కదపని రాష్టాలు

⦁ దేశ రాజధాని దిల్లీలో ఎంపికైన 13 గ్రామాల్లో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తయిన దాఖలాలు కనిపించలేదు.
⦁ పశ్చిమ్​ బంగాలో 9 గ్రామాల్లోని 61 అభివృద్ధి పనుల్లో ఒక్కటీ పూర్తి కాలేదు.

ఇదీ చూడండి: ఫెడ్ వడ్డీ రేట్లు, కీలక గణాంకాలే ఈ వారానికి కీలకం

ABOUT THE AUTHOR

...view details