తెలంగాణ

telangana

ETV Bharat / business

2021లో భారత వృద్ధి రేటు -9%: ఎస్​ అండ్​ పీ

2021లో భారత వృద్ధి రేటు -9శాతానికి పరిమితమవుతుందని ఎస్​ అండ్​ పీ గ్లోబల్​ రేటింగ్స్​ అంచనా వేసింది. దేశంలో పెరుగుతున్న కేసులు ఇందుకు ఓ కారణమని తెలిపింది. గతంలో ఇదే సంస్థ.. భారత వృద్ధి రేటు -5శాతంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం.

S&P projects Indian economy to contract 9 pc in FY21; says COVID-19 will restrain economic activity
2021లో భారత వృద్ధి రేటు -9శాతం: ఎస్​ అండ్​ పీ

By

Published : Sep 14, 2020, 4:30 PM IST

కరోనా సంక్షోభం దృష్ట్యా భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించింది ఎస్​ ఆండ్​ పీ గ్లోబల్​ రేటింగ్స్​​. 2021 ఆర్థిక సంవత్సరానికి గానూ.. భారత వృద్ధి రేటు -9శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. భారత్​ -5శాతం వృద్ధి రేటు సాధిస్తుందని గతంలో ఎస్​ అండ్​ పీ గ్లోబల్​ రేటింగ్స్​ పేర్కొనడం గమనార్హం.

వైరస్ విజృంభణ​ కారణంగా ఆదాయం కోల్పోతున్నందు వల్ల.. ప్రైవేటు వినియోగం తగ్గే అవకాశం ఉన్నట్లు రేటింగ్​ సంస్థ వివరించింది. పెట్టుబడులు కూడా తగ్గుతాయని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలోని అసంఘటిత రంగాల రికవరీ బలహీనంగా ఉండటం, సూక్ష్మ, చిన్న సంస్థలు ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోవడం కూడా వృద్ధి అంచనాలను తగ్గించడానికి కారణంగా పేర్కొంది.

అయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 10శాతంగా ఉంటుందని అంచనా వేసింది ఎస్​ అండ్​ పీ సంస్థ.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details