పెట్టుబడుల విషయంలో భారత్‌కు వరుసగా 13వ సారి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ 'స్టాండర్డ్స్ అండ్ పూర్స్' అత్యల్ప గ్రేడింగ్ ఇచ్చింది. పెట్టుబడుల్లో భారత సార్వభౌమ రేటింగ్‌ను 'బీబీబీ-' కే పరిమితం చేసింది. 2021 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ ప్రారంభమై కోలుకుంటుందని స్పష్టం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 శాతం తగ్గనుందని ఎస్ అండ్ పీ అంచనా వేసింది. 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ఠానికి చేరి 4.2 శాతంగా నమోదైంది. అయినప్పటికీ 2021-22 ఏడాదికి జీడీపీ వృద్ధి రేటు 8.5 శాతం, 2022-23లో 6.5 శాతంగా ఉంటుందని స్పష్టం చేసింది ఎస్ అండ్ పీ.
"భారత దీర్ఘకాలిక వృద్ధిరేటుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంస్కరణలు సరిగ్గా అమలైతే వృద్ధి రేటు పుంజుకుంటుంది. దీర్ఘకాలికంగా బీబీబీ-, స్వల్పకాలికంగా ఏ-3 రేటింగ్‌లో ఉంది భారత్. దేశ జీడీపీ వృద్ధికి బాహ్య కారకాలు, ద్రవ్య విధానాల పనితీరు ప్రభావం చూపటమే కారణం. "